పంచరుచుల ఉగాది పచ్చడి

image
Description

పంచరుచుల ఉగాది పచ్చడి!
********************************

ఒక వెండి బౌల్ లో చింతపండు గుజ్జు తీసుకుని అందులో సరిపడ బెల్లం కంటె కాస్త ఎక్కువే వేయాలి. తర్వాత – ఒక అరచెంచా పంచదార, చిటికెడు ఉప్పు, కారం, ఇలాచీ పొడి, నాలుగు పోచలు సోంపు, సన్నగా కట్ చేసుకున్న అరటిపండు, మామిడికాయ, కొబ్బరి ముక్కలు వేసి కలిపి, ఆ పైన వేప పూల రెక్కలు గుప్పెడు వేసి, – దేవుని కి నివేదించాలి.
మనసులో కులదైవాన్ని ప్రార్ధించి, పూజానంతరం – ప్రసాదం గా స్వీకరించే ఉగాది పచ్చడి బహు రుచి గా వుంటుంది. నాలిక మీద పంచురుచులూ అలా నాట్యమాడి శుభ సందేశాన్నిచ్చి పోతాయి.
ఉగాది పచ్చడిని కొన్ని జిల్లాల వారు పానకం లా చేసుకుని తాగుతారు.
కృష్ణా, గుంటూరు మరి కొన్ని ఆంధ్రా జిల్లాల వారు చిక్కగా చేసుకుని, చిన్న చిన్న బవ్ల్స్ లో చెంచా తో తీసుకుంటారు.

ఎలా చేసినా – ఉగాది పచ్చడి నూతనం గా నే వుంటుంది. నవ్య రుచులు కోరుతూ మరి మరి కొసరుగా రుచిచూడాలనిపిస్తుంది.

నేనైతే జాస్తి గానే తయారు చేస్తాను. ఫ్రిజ్ లో వుంచుకుని 2 రోజులు పాటు కొంచెం కొంచెం గా రుచి గా తీసుకుంటాను.
బావుంటుంది.

*కావలసిన వారు ఇంకా – అర పచ్చిమిరపకాయ ముక్కల్ని
* యాపిల్, సపోటా ముక్కల్ని, జీడిపప్పు పలుకులునీ కూడా కలుపుకుంటారు.

కొలుచుకున్న వారికి కొలుచుకున్నంత దైవం అనే చందాన, ఈ ఉగాది పచ్చడ్ని ఎవరెంత వన్నె వన్నెల రుచులుగా తయారు చేసుకుంటే అంత గొప్ప రుచి వచ్చి కలుస్తుంది.

ఈ నాటి ఈ శుభ సందర్భంగా
గౌరవనీయులైన గ్రూప్ అడ్మిన్ Jvrk Prasad గారికి, మనసభ్యులకి, ఆత్మీయమైన పలుకులొలుకు పెద్దలకీ, మనసెరిగిన మిత్రులకీ అందరకీ పేరు పేరునా ఉగాది పర్వదిన శుభాకాంక్షలండి.

అందరకీ విజయం సిధ్ధించాలి.
మనోవాంచలు నెరవేరాలి.
శుభాలు కలగాలి.
దైవ భక్తి పెరగాలి.
సరస భావాలు వెల్లువై కురవాలి.
సమాజం బావుండాలి. మన్మూ బావుండాలి.
మనమందరమూ ఇలాగే ఇలా ఇక్కడ ఎన్నో కబుర్లాడుకుంటూ కులాసాగా, హాయిగా కాలాన్ని గడపాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.Visit blogadda.com to discover Indian blogs
%d bloggers like this: